సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్‌గూడ గ్రామపంచాయతీ పరిధిలోని పాముల వాగుపై అక్రమ నిర్మాణాలు జరిపారు. విషయం తెలుసుకున్న జిల్లా పాలనాధికారి హనుమంతరావు నాలాలపై అక్రమ నిర్మాణాలు జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌తో పాటు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో పూర్తి వివరణ ఇవ్వాలని లేని పక్షంలో శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు, థియేటర్లు, బార్లు బంద్: కేసీఆర్