పటాన్చెరును ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దుతాని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. దీనిలో భాగంగా ఐనోల్ గ్రామ పరిధిలో ఒకేచోట విద్యాసంస్థలు, రెసిడెన్షియల్ హాస్టల్ భవన నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పటాన్చెరు మండలం పాటి గ్రామపరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న స్టేడియం, మైత్రి మైదానం, గ్రామీణ వైద్యశాల కేంద్రం, వ్యవసాయ మార్కెట్లను ఆయన పశీలించారు.
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో అభివృద్ధి పనులు వాటి పురోగతిపై చర్చించారు.పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నియోజకవర్గంలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్జీటీ ఆదేశాలకు అనుగుణంగా మల్టీపర్పస్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి నివేదిక అందిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే అన్ని రకాల వ్యాధులకు ఇక్కడే చికిత్స లభిస్తుందని అన్నారు.
ఈఎస్ఐ డిస్పెన్సరీ, పీఎఫ్ కార్యాలయాలను ఆసుపత్రి సమీపంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. 14 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్ యార్డులో రిటైల్ వెజిటేబుల్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సూచించిన అంశాలపై త్వరలోనే సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించి, కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రైతు బంధు కింద రూ.6,272 కోట్ల 55 లక్షలు పంపిణీ