సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో జిల్లా పాలనాధికారి హనుమంతరావు ఆకస్మికంగా పర్యటించారు. ధరణి సర్వేలో భాగంగా ఇంటి నిర్మాణాల వివరాలను పంచాయతీ సిబ్బంది నమోదు చేస్తున్న ప్రక్రియను పరిశీలించారు.
గ్రామ పరిధిలోని ప్రతి ఒక్క కుటుంబ యజమాని పేరు, ఆధార్ నంబర్, చరవాణి నంబర్, నిర్మాణం స్వభావం, విస్తీర్ణం కొలతలు తీసుకుని నమోదు చేయాలన్నారు. అన్ని రకాల నిర్మాణాల వివరాలు అంతర్జాలంలో నమోదయితే భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి: ప్రభుత్వరంగ సంస్థల బకాయిలే రూ.200కోట్లు