ETV Bharat / state

గడువులోగా అభివృద్ధి పనులు పూర్తికాకుంటే చర్యలు తప్పవు: కలెక్టర్​ - development programs in sangareddy

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయకుంటే బాధ్యులైన అధికారులు, గుత్తేదారులపై చర్యలు తప్పవని జిల్లా పాలనాధికారి హనుమంతరావు హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో ఆయన ఆకస్మికంగా పర్యటించారు.

collector hanumanta rao visit development works at andhol in sangareddy district
గడువులోగా అభివృద్ధి పనులు పూర్తికాకుంటే చర్యలు తప్పవు: కలెక్టర్​
author img

By

Published : Aug 13, 2020, 6:58 AM IST

సంగారెడ్డి జిల్లా అందోల్, వట్టిపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో జిల్లా పాలనాధికారి హనుమంతరావు ఆకస్మికంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లోని అభివృద్ధి నిర్మాణ పనులను పరిశీలించారు. అందోల్ మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో నిర్మిస్తున్న వైకుంఠధామం పనులను ఆయన పర్యవేక్షించారు. పనుల్లో జాప్యం తగదని గడువులోగా పూర్తి చేయాలని గుత్తేదారులను ఆయన ఆదేశించారు. వట్​పల్లి మండలంలోని మేడికుంద, ఉసిరికపల్లి తదితర గ్రామాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేశారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైకుంఠధామం, డంప్​యార్డులు, రైతు వేదికలు, పల్లెప్రకృతి వనాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. 647 గ్రామపంచాయతీల్లో డంప్​యార్డు నిర్మాణ పనులు, వైకుంఠధామాలు పలుచోట్ల పూర్తికాగా మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా పనులు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.

ఇది చూడండి రివ్యూ: కార్గిల్‌ గర్ల్ 'గుంజన్'‌ ఆకట్టుకుందా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.