ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన 'ఛలో ఆర్ఎం కార్యాలయం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆర్టీసీ డిపో నుంచి ఆర్ఎం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేతన సవరణ చేయాలని, కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారంపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందనలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దశల వారీగా పోరాటాలు చేసేందుకు కార్మికులు సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఇవీ చూడండి: "తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి"