సంగారెడ్డిలో చాకలి ఐలమ్మ 35వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. రజక సంఘం నాయకులు ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆమె పోరాటాలను గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై పెడతామని చెప్పారని... ఆరు సంవత్సరాలు గడుస్తున్నా విగ్రహం నెలకొల్పలేదన్నారు.
ప్రతి జిల్లాలో రజక సంఘం భవనాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ కోసం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ ఎలాంటి లబ్ధి పొందలేదని తెలిపారు. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీల్లో ఉన్నారని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: బీసీ జాబితాలో మరో 17 కులాలు.. ఉత్తర్వులు జారీ..