ETV Bharat / state

ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు నమోదు - సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై పోలీసుల కేసు నమోదు

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు కారణం ఆయన సదాశివపేట ర్యాలీలో మంత్రి హరీశ్ రావును ఇష్టమొచ్చినట్లుగా తిట్టడమే.

filed case on jaggareddy
ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు నమోదు
author img

By

Published : Jan 20, 2020, 10:10 AM IST

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావును ఉద్దేశించి సదాశివపేట ర్యాలీలో... సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి దుర్భాషలాడారు. జగ్గారెడ్డి తీవ్రస్థాయి అసభ్య పదజాలంతో మాట్లాడిన దృశ్యాలను ఓ వ్యక్తి సెల్ ఫోన్​లో వీడియో తీచారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయింది. జగ్గారెడ్డి అనుచిత వాఖ్యలపై తెరాస నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఇంత నీచంగా మాట్లాడిన వారెవరూ లేరని... ఈ మాటాలు ప్రజలు తలవంచుకునేలా ఉన్నాయని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్​లో జగ్గారెడ్డిపై ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు

ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు నమోదు చేశామని సంగారెడ్డి గ్రామీణ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. జగ్గారెడ్డి సదాశివపేట ర్యాలీలో... మంత్రి హరీశ్ రావునుద్దేశించి అసభ్య పదజాతంలో దూషించారని, ఇరువర్గాలను రెచ్చగొట్టేలా ప్రసంగించారని మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ ఫిర్యాదు చేసినట్లు వివిరించారు. ఈ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై ఐపీసీ 153ఏ, 504ఏ, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు.

ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు నమోదు

ఇవీ చూడండి: నేటి నుంచి దావోస్​లో కేటీఆర్​ పర్యటన

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.