సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని సాకిచెరువు వద్ద భాజపా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కబ్జాకు గురైన సాకి చెరువుపై సిట్టింగ్ జడ్జితో విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆధారాలతో సహా నిర్ధరణ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని... జీహెచ్ఎంసీ ఎన్నికల ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు.
తెరాస నాయకుల ఆక్రమణ వల్ల చెరువు కుచించుకుపోయిందని ఆరోపించారు. ఇలాంటి చర్యల వల్లే హైదరాబాద్లో వరదలకు ఇళ్లలోకి నీరు చేరిందన ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా వంద స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. కర్రు కాల్చి వాత పెట్టినట్టు తెరాసకు ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి : నాల్గో రోజు వైభవంగా తుంగభద్ర పుష్కరాలు