తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భాజపా నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, జిన్నారం రామచంద్రపురం, అమీన్పూర్, బీడిఎల్ భానూరులో భాజపా నేతలను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. బీజేవైఎం నాయకులు ఆశిశ్ గౌడ్ పోలీసుల అరెస్టుకు సహకరించకపోవడం వల్ల బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో 40 మంది భాజపా నాయకులను అరెస్టు చేశారు.
ఇదీ చూడండి: యాదగిరిగుట్టలో భాజపా నాయకుల అరెస్టు