దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపుతో భాజపా నేతలు సంబురాలు చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఆ పార్టీ కార్యకర్తలు టపాసులు కాల్చి... మిఠాయిలు పంచారు.
స్థానిక రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద వేడుకలు చేసుకున్నారు. దుబ్బాక గెలుపుతో భాజపా విజయం... తెరాస పతనం ప్రారంభమైందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ భాజపా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: కార్యకర్త నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన రఘునందన్ రావు