ETV Bharat / state

ఆదుకోవాల్సిన బ్యాంకులే.. ఆడుకుంటున్నాయి - రుణాలు చెల్లించినా తిప్పుకుంటున్నారు.

అన్నదాత నిస్సాహయతను ఆసరగా చేసుకుని బ్యాంకులు నిర్లక్ష్యం చేస్తున్నాయి. రైతులకు ప్రాథాన్యత ఇచ్చి బాధ్యతాయుతంగా సత్వర సేవలు అందించాల్సిన వ్యవసాయ అనుబంధ శాఖలు సైతం చుక్కలు చూపిస్తున్నాయి. రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నాయి. కర్షకులను కాళ్లు అరిగేలా తమ చుట్టూ తిప్పుకుంటున్నాయి.

banks cheating formers in sadashivpeta sangareddy district
ఆదుకోవాల్సిన బ్యాంకులే.. ఆడుకుంటున్నాయి
author img

By

Published : Jul 28, 2020, 2:02 PM IST

బ్యాంకులు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నాయన ఉద్దేశంతో ప్రభుత్వం వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తోంది. వ్యవసాయ అనుబంధ రంగాల రుణాలపై ప్రతి బ్యాంకుకు టార్గెట్​లు నిర్దేశిస్తోంది. అయినా బ్యాంకు అధికారులు... రైతుల పట్ల చిన్నచూపే చూస్తున్నారు. అన్నదాతకు రుణం ఇవ్వడంలో, తనఖా పెట్టిన భూమి, బంగారం వంటివి రుణం తీర్చాక విడుదల చేయడంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. సరైన అవగాహన లేని వారు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఏ బ్యాంకు ముందు చూసినా ధీనంగా రైతులు కనిపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని ఎస్బీఐ బ్యాంకు వద్ద ఈటీవీ భారత్​కు ఇలాంటి దృశ్యాలే కనిపించాయి.

బొబ్బిలిగామ గ్రామానికి చెందిన మొగులయ్య అనే రైతుకు ఒక్కడే కొడుకు. కొడుకుకు ఉపాధి దొరుకుతుందని ఐదు సంవత్సరాల క్రితం బ్యాంకులో రుణం తీసుకొని ట్రాక్టరు కోనుగోలు చేశాడు. మొగులయ్య కొడుకు ట్రాక్టర్ నడుపుకుంటూ... వాయిదాలు చెల్లించాడు. రెండు సంవత్సరాల క్రితం కొడుకు మృతి చెందాడు. దీంతో కుటుంబ భారం మొగులయ్యపైనే పడింది. దీనికి తోడు... ట్రాక్టరు నడిపే వారు లేక, దాని నుంచి వచ్చే ఆదాయం తగ్గింది. అందిన చోటల్లా అప్పులు చేసి బ్యాంకు వాయిదాలు చెల్లించాడు. చివరికి అప్పులు చేయలేక ఆరు నెలల క్రితం వాయిదా కట్టడం ఆపేశాడు. దీంతో వెంటనే బ్యాంకు వాళ్లు ట్రాక్టర్ లాక్కెళ్లారు. నెల క్రితం మొగులయ్య బ్యాంకు అధికారులను సంప్రదించగా... ఐదున్నర లక్షల రూపాయలు చెల్లిస్తే లోన్ సెటిల్ చేసి ట్రాక్టర్ ఇస్తామన్నారు. ఎలాగోలా అప్పు చేసి... చెల్లించాడు. ఆ తర్వాత పంట రుణం కూడా చెల్లించాలనగా... మరో లక్షన్నర బ్యాంకులో కట్టాడు. ఇప్పుడు తీరా ట్రాక్టర్ ఇవ్వమంటే... బ్యాంకు అధికారులు కుంటి సాకులు చెబుతున్నారు. ముందే చెప్తే ఈ కష్ట కాలంలో అప్పులు చేయకపోయేవాడినని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ఇదే గ్రామానికి చెందిన నరసింహులు అనే రైతు బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడు. నరసింహులు చనిపోయిన తర్వాత... బంగారం విడిపించుకునేందుకు అతని కొడుకు జంగయ్య బ్యాంకు అధికారులను సంప్రదించాడు. గోల్డ్ లోన్​తోపాటు పంట రుణం కూడా కట్టాలని చెప్పగా... అప్పు చేసి తీర్చాడు. బంగారం ఇవ్వమంటే రేపుమాపు అంటూ... తిప్పుతున్నారని జంగయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తమ సమాచారం ఇవ్వకుండానే... బ్యాంకు అధికారులు మరో ఖాతాలో ఉన్న డబ్బులు డ్రా చేసుకున్నారని శివకుమార్ అనే రైతు తెలిపాడు.

అన్నదాతలను బ్యాంకులు చిన్నచూపు చూస్తున్నాయని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా... బ్యాంకు అధికారుల తీరు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కోంటున్న రైతులను ఆదుకోవాల్సిన బ్యాంకులే ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా బ్యాంకు అధికారులు తీరు మార్చుకొని రైతులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి: చైనా బాగోతం బట్టబయలు- వుహాన్ మార్కెట్లో ఆధారాలు ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.