సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఓ బ్యాంకు ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పట్టణంలోనే స్థానికంగా ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబసమేతంగా నివసిస్తున్నారు. సోమవారం ఉదయం ఎంతకీ నిద్రలేవకపోగా.. అతని భార్య ఇంటి యజమానికి సమాచారమిచ్చారు.
వారు అతన్ని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఈటల ఓఎస్డీకి కరోనా... గత 2రోజులుగా ఆయనతోనే మంత్రి