ముందుగా గ్రామ సభ నిర్వహించిన కమిటీ ప్రతినిధులు కాలుష్య కారక పరిశ్రమపై ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నారు. అనంతరం గ్రామ శివార్లలోని పొలాల్లో పంటల పరిస్థితులు, బోరుబావిలోని నీటి నమూనాలను సేకరించారు.అల్లానా పరిశ్రమ వల్ల తమ పంటల మీద తీవ్ర దుష్ప్రభావం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
''మా ప్రాణాలు, పంటలుకాపాడండి''
ప్రజాభిప్రాయంతో పాటు నివేదికలు రూపొందించి హైకోర్టు హరిత ధర్మాసనానికి సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.వీలైనంత త్వరగా ఫ్యాక్టరీని మూసివేయించి తమ ప్రాణాలు కాపాడాలని పస్తాపూర్ వాసులు కోరుతున్నారు.
ఇవీ చదవండి :జనసేన తొలి అభ్యర్థి ఖరారు