గురువారం ప్రధాని నరేంద్రమోదీ 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలో భాజపా జిల్లా కార్యాలయంలో భాజపా దళిత మోర్చా ఆధ్వర్యంలో ఆయుష్షు హోమాన్ని నిర్వహించారు. మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని, దేశ ప్రజలకు అండగా ఉండి భాజపా నాయకులను ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
ప్రధాని మోదీ దేశంలోనే గొప్ప పేరు పొందిన వ్యక్తి అని భాజపా నాయకులు కొనియాడారు. మోదీ పాలనలో తాము భాగస్వాములు అయినందుకు గర్వంగా ఉందన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అందరి మన్ననలు పొందిన గొప్ప వ్యక్తి మోదీ అని... దేశానికి ఆయన చేసిన సేవ ఎనలేనిదని అన్నారు.
ఇదీ చూడండి : పచ్చదనంతో నిండిన అనంతగిరి కొండలు..