ETV Bharat / state

'ఆశా కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

author img

By

Published : Mar 13, 2020, 9:59 PM IST

సంగారెడ్డిలో సీఐటీయూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆశా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిన్న ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్న వారిని అరెస్టు చేసిన పోలీసులపై మండిపడ్డారు.

Asha workers problems demand dharna at sangareddy
'ఆశా కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

ఆశా వర్కర్ల సమస్యలు నెరవేర్చాలని నిన్న ఛలో హైదరాబాద్​ కార్యక్రమానికి వెళ్తున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఘటనపై సీఐటీయూ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి కొత్త బస్టాండ్ ఆవరణలో సీఐటీయూ నాయకులు, ఆషా కార్మికులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆశా కార్మికులకు నెలకు వేతనం రూ. 21 వేలు ఇవ్వాలన్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్​ చేశారు. తక్షణమే వారి సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని సీఐటీయూ నాయకులు పేర్కొన్నారు.

'ఆశా కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

ఇదీ చూడండి : బైకుపై నుంచి పడ్డవారిపై దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.