సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని మాచిరెడ్డిపల్లిలో మైక్రోసాఫ్ట్ ఫౌండేషన్, భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో తేనెటీగల పెంపకం, సేంద్రియ విధానంలో కూరగాయల సాగుపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రైతులకు తేనెటీగల పెంపకంపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు.
పంట పొలంలో అదనంగా ఏర్పాటు చేసుకుంటే 100 కేజీల వరకు తేనె ఉత్పత్తి చేసే అవకాశం ఉందని వివరించారు. ఈ విధంగా ఒక ఎకరంలో యాభై నుంచి వంద చుట్టాలను ఏర్పాటు చేసుకుంటే భారీగా ఆదాయం పొందవచ్చని సూచించారు. ప్రయోగాత్మకంగా తేనెతుట్టెను తీసుకువచ్చి రైతులకు పెంపకం విధానాన్ని వివరించారు.
ఇదీ చూడండి : శిశువు మరణంపై కలెక్టర్ విచారణ... ఇద్దరు వైద్యుల సస్పెండ్