సంగారెడ్డి జిల్లాలోని కల్హేర్ తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న నర్సింలు అనిశాకు చిక్కాడు. జోగిపేటలోని ఓ హోటల్లో రైతు వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అందోల్ తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోగా విధులు నిర్వహించిన నర్సింలు కల్హేర్ తహసీల్దార్ కార్యాలయానికి పదోన్నతిపై బదిలీ అయ్యాడు.
అందోల్ మండలం దానంపల్లికి చెందిన కోనాపురం మాణయ్య అతని భార్య పేరు మీద రెండున్నర ఎకరాల పొలం ఉంది. కొత్త పాస్‌బుక్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. చింతకుంటకు చెందిన వీఆర్వో నర్సింలు రూ.10,000 లంచం ఇస్తేనే పాస్‌పుస్తకాలను ఇస్తానని మాణయ్యకు తెలిపాడు. అంత ఇచ్చుకోలేనని రూ.2700 ఇచ్చారు. ఆ డబ్బు తీసుకున్న వీఆర్వో మిగతా డబ్బులు ఇచ్చే వరకు పాసుపుస్తకాలు ఇవ్వనని చెప్పాడు. విసుగు చెందిన రైతు మాణయ్య ఏసీబీని ఆశ్రయించాడు. వెంటనే స్పందించిన అధికారులు జోగిపేటలోని ఓ హోటల్లో రూ. 5000 లంచం ఇస్తుండగా... పట్టుకున్నట్లు అనిశా అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి:- తప్పతాగి తప్పుడు పనికి యత్నిస్తే ఉతికారేశారు!