కరోనా వైరస్ బారిన పడిన పోలీస్ శాఖలోని అధికారులు, సిబ్బందికి తక్షణం వైద్య సదుపాయం కల్పించే చర్యల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి అంబులెన్స్ ప్రారంభించారు. ఆక్సిజన్ సదుపాయం ఉన్న ఈ అంబులెన్స్ ద్వారా పోలీసుశాఖలో కరోనా వైరస్ బారిన పడిన సిబ్బందిని అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి తరలించనున్నారు. చికిత్స అనంతరం ఇంటికి చేర్చడానికి సైతం దీనిని వినియోగించనున్నారు.
ఇవీ చూడండి: పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ కొత్త పోర్టల్