ETV Bharat / state

Icrisat PM visit: ఇక్రిశాట్​ స్వర్ణోత్సవాలు.. ప్రధాని పర్యటన దృష్ట్యా ఏరియల్​ సర్వే - icrisat

Icrisat PM visit: స్వర్ణోత్సవ సంబురాలకు ఇక్రిశాట్ సిద్ధమైంది. హైదరాబాద్​ నగర శివారు పటాన్​చెరులో ఏర్పాటైన ఇక్రిశాట్​.. ఫిబ్రవరి 5న జరుపుకొంటున్న 50 ఏళ్ల ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ క్రమంలో మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా దళాలు ముందస్తుగా ఏరియల్​ సర్వే నిర్వహించాయి.

icrisat golden jubilee
ఇక్రిశాట్​ స్వర్ణోత్సవం
author img

By

Published : Feb 3, 2022, 4:11 PM IST

Icrisat PM visit: ఫిబ్రవరి 5న ఇక్రిశాట్​(అంతర్జాతీయ సమశీతోష్ణ మండల పంటల పరిశోధన సంస్థ).. స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ వేడుకలకు హాజరుకానున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా బలగాలు ముందస్తుగా ఏరియల్​ సర్వే నిర్వహించాయి. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలో ఉన్న ఇక్రిశాట్​ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. భద్రతా బలగాలు గగనతలంలో తిరుగుతూ సంస్థ ప్రాంగణం మొత్తాన్ని పరిశీలించారు. వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ప్రధాన మంత్రి కార్యాలయం ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇక్రిశాట్​ వర్గాలు తెలిపాయి. ఇక్రిశాట్​ నూతన లోగోను ప్రధాని ఆవిష్కరించనున్నారు.

icrisat golden jubilee
ఏరియల్​ సర్వే

పోషకాహార భద్రత కోసం

Icrisat golden jubilee: రైతులకు మేలైన విత్తనాలు, నూతన సాగు విధానాలను చేరువచేస్తూ.. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ఆహార సంక్షోభ నివారణకు ఇక్రిశాట్​ ఇతోధిక సేవలందిస్తోంది. పటాన్‌చెరులో 3,434 ఎకరాల్లో 1972లో ఈ సంస్థ ఏర్పాటైంది. ప్రధానంగా కంది, జొన్న, వేరుసెనగ, సెనగ, సజ్జలు తదితర పంటలకు సంబంధించి వందల వంగడాలను ఆవిష్కరించిన ఈ సంస్థ.. కొత్తగా ‘పోషకాహార భద్రత’ కల్పించే, వాతావరణ మార్పులను తట్టుకునే వంగడాలపై పరిశోధనలు చేస్తోంది. కృత్రిమ మేధ(ఏఐ)తో సాగు పద్ధతుల్లో మార్పులు, భూసార పరీక్షలతో పంటల ఉత్పాదకత పెంపు లక్ష్యంగా పలు ప్రాజెక్టులు అమలు చేస్తోంది.

హైదరాబాద్​లో అనుకూల వాతావరణం

ఇక్రిశాట్‌ను పటాన్‌చెరులో ఏర్పాటుచేయడానికి ముందు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారీ కసరత్తు జరిగింది. అప్పట్లో ఈ కేంద్రం ఏర్పాటుకు మన దేశంలో బెంగళూరు నుంచి గట్టి పోటీ ఏర్పడింది. దక్కన్‌ పీఠభూమిలోని హైదరాబాద్‌ ప్రాంతం విభిన్న నేలలతో తృణ, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటల సాగుకు అనుకూలంగా ఉండటం ఒక విశేషం కాగా.. పటాన్‌చెరు ప్రాంతంలో పక్కపక్కనే నల్లరేగడి, ఎర్రమట్టి నేలలు ఉండటం అంతర్జాతీయ నిపుణులను ఆకర్షించింది. దీనికితోడు హైదరాబాద్‌లో ఉండే అనుకూల వాతావరణమూ ఇటే మొగ్గుచూపేలా చేసింది.

సంబంధిత కథనాలు: ICRISAT Hyderabad Golden Jubilee : ఫిబ్రవరి 5న ఇక్రిశాట్ స్వర్ణోత్సవం.. ప్రధాని మోదీ హాజరు

ICRISAT Hyderabad Golden Jubilee : పరిశోధనల క్షేత్రం.. చరిత్రకు సాక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.