Brutal murder in Sangareddy: మనిషి సహనం నశిస్తే ఎంతటి దారుణం చేయడానికైనా వెనకాడడు అనే నానుడిని ఓ యువకుడు నిజం చేశాడు. భూతగాదాలు విషయంలో వారి బంధువులతో వచ్చిన తగదాల వల్ల పెదనాన్ననే హత్య చేశాడు. అనంతరం గ్రామం అంతా తిరిగి మధ్యలో తానే చంపానని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ తరవాత స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసులకి లొంగిపోయాడు.
జహీరాబాద్ రూరల్ సీఐ నోముల వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా ఝరా సంఘం మండలం బర్దిపూర్లో చంద్రన్న(55), వారి తమ్ముడు రత్నంకి భూతగాదాలు కొన్ని సంవత్సరాలుగా ఉన్నాయి. ఆ సమస్య ఎప్పటికి పరిష్కారం దొరకపోడంతో రత్నం కుమారుడు రాకేశ్ విసిగి చెందాడు. దీంతో పెదనాన్న చంద్రన్నను హత్య చేద్దామని అనుకున్నాడు. అనుకున్న విధంగానే బర్దిపూర్ అటవీ ప్రాంతంలో చంద్రన్న కోసం మాటు వేసి తల్వార్తో వేటు వేసి.. తల, మొండెం వేరు చేశాడు. చంద్రన్న తలను పట్టుకొని గ్రామ వీధుల్లో తిరుగుతూ ఊరి జనానికి చూపించాడు. హత్య అనంతరం రాకేష్ గ్రామంలోకి వచ్చి స్థానిక బసవేశ్వర విగ్రహం దగ్గర పెద్దనాన్నని తానే చంపానని వీడియో రికార్డ్ చేసుకున్నాడు.
అనంతరం ఫేస్బుక్లో ఫోస్ట్ చేశాడు. తలను ఝరాసంఘం వైపు తీసుకెళ్లి కల్వర్టు కింద పారేశాడు. అక్కడి నుంచి జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. వెంటనే ఘటన స్థలాన్ని జహీరాబాద్ రూరల్ సీఐ వెంకటేష్ సందర్శించి హత్య ఘటన వివరాలను బాధిత కుటుంబీకులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చంద్రన్న హత్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని సీఐ వెంకటేష్ తెలిపారు.
వివాహితపై గుర్తు తెలియని వ్యక్తి దాడి: అలానే మెదక్ జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. పాత కక్షలతో వివాహితపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేయడంతో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. రామయంపేట ఎస్సై రంజిత్ తెలిపిన వివరాలు ప్రకారం.. మెదక్ జిల్లా రామయంపేట మండలం ప్రగతి ధర్మారంలో స్రవంతి అనే వివాహితపై కత్తితో గుర్తి తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. బాధితురాలిని రామయం పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల వల్లనే మహిళపై దాడి చేశారని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎవరు చేశారో వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. దర్యాప్తు చేసిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్సై పేర్కొన్నారు.
ఇవీ చదవండి: