గత ఏడాది సెప్టెంబర్ లో సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ కూడలిలో విద్యుత్తు తీగ తెగి తన భర్త శ్రీనివాస్ పై పడటంతో అనారోగ్యం బారినపడి మృతి చెందాడని అతని భార్య మంజుల తెలిపింది. ఇంత వరకు విద్యుత్ శాఖ అధికారులు వారి కుటుంబానికి ఎటువంటి పరిహారం చెల్లించలేదని ఆరోపించింది. అసలే ఇంటి పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న తమకు.. తన ఆరోగ్యం కూడా దెబ్బతినటంతో.. పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వాపోయింది.
వెంటనే తమ కుటుంబానికి నష్టపరిహారం అందించాలని ఆమె డిమాండ్ చేసింది. విద్యుత్ అధికారుల చుట్టూ ఎన్ని సార్లు తిరిగిన పట్టించుకోవడంలేదని ఆరోపించింది. న్యాయం చేయాలంటూ విద్యుత్ శాఖ ఏఈ నాగరాజుకు వినతిపత్రం అంజేశారు. వెంటనే పరిహారం ఇప్పించి తమను ఆదుకునేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవీ చదవండి: సంగారెడ్డిలో వర్చువల్ లోక్అదాలత్ వాహన ప్రారంభం