ETV Bharat / state

అమీన్​పూర్​లో రెండు కరోనా కేసులు నమోదు - సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​లో రెండు కరోనా కేసులు నమోదు

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ మున్సిపాలిటీ పరిధిలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కాలనీలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.

two corona positive cases in ameenpur
అమీన్​పూర్​లో రెండు కరోనా కేసులు నమోదు
author img

By

Published : Jun 13, 2020, 2:24 PM IST

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ మున్సిపాలిటీ పరిధిలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్ఎస్ఎల్, ఐటీడబ్ల్యూ కాలనీల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. అలాగే బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లించారు. పాజిటివ్ వచ్చిన వారితో సన్నిహితంగా మెలిగిన వారెవరైనా ఉన్నారా అని తెలుసుకుంటున్నారు.

స్థానిక ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు కాలనీలో పరిస్థితిని సమీక్షిస్తున్నట్లుఅమీన్​పూర్ మున్సిపల్ కమిషనర్ సుజాత తెలిపారు. స్థానిక ప్రజలెవరూ అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదని... వచ్చినా మాస్కులు, భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ఇవీ చూడండి: అకాల వర్షాలతో రైతన్న కష్టం నేలపాలు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.