ETV Bharat / state

ఉమ్మడి మెతుకుసీమపై కరోనా పంజా.. ఒక్కరోజే 100 కేసులు

ఉమ్మడి మెతుకుసీమపై కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వైరస్​ విజృంభణ కొనసాగుతుండటం వల్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

100 new corona cases in joint medak district
ఉమ్మడి మెతుకుసీమపై కరోనా పంజా.. ఒక్కరోజే 100 కేసులు
author img

By

Published : Jul 18, 2020, 9:20 AM IST

ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం మరో 100 మంది ఈ వైరస్​ బారినపడగా.. ఇద్దరు మృతి చెందినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఇందులో సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 72 కేసులు వెలుగుచూడగా.. ఇద్దరు చనిపోయారు. సిద్దిపేట జిల్లాలో 19 మంది వైరస్​ బారినపడగా.. మెదక్​ జిల్లాలో 9 మంది కరోనా కోరల్లో చిక్కుకున్నారు.

ఫలితంగా అప్రమత్తమైన అధికారులు కేసులు నమోదైన ప్రాంతాలను రసాయన ద్రావణాలతో పిచికారీ చేయిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమయితే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.

మరోవైపు కొవిడ్​ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుండటం వల్ల ఒక్కో పట్టణం స్వచ్ఛందంగా లాక్​డౌన్ పాటిస్తున్నాయి. ఇప్పటికే జహీరాబాద్, సదాశివపేటలో అధికారులు లాక్​డౌన్​ అమలు చేస్తుండగా.. నేటి నుంచి దుబ్బాకలోనూ అమలు చేయనున్నారు.

ఇదీచూడండి: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 20 మందికి కరోనా పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.