ETV Bharat / state

YS Sharmila Padayatra 2021: ప్రజల ప్రతి సమస్యా.. నా సమస్యే: వైఎస్ షర్మిల - షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర

ఇబ్ర‌హీంప‌ట్నం నియోజకవర్గంలోని సీతమ్మపేట్​లో 10వ రోజు పాదయాత్ర ఘనంగా ప్రారంభమైంది (YS Sharmila Padayatra). సీతమ్మపేట్ నుంచి నోముల, లింగపల్లి క్రాస్ మీదుగా సాగుతోంది. సాయంత్రం మంచాల గ్రామంలో మాటా-ముచ్చట నిర్వహించనున్నారు.

sharmila padayatra
sharmila padayatra
author img

By

Published : Oct 29, 2021, 3:35 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నం నియోజకవర్గంలోని సీతమ్మపేట్ నుంచి నోముల, లింగపల్లి క్రాస్ మీదుగా వైఎస్​ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగుతోంది. సాయంత్రం మంచాల గ్రామంలో మాటా-ముచ్చట నిర్వహించి, కేసీఆర్ నియంత పాలనలో ప్రజల కష్టాలు తెలుసుకోబోతున్నానని షర్మిల ప్రకటించారు.

ప్రజల సమస్యలు వింటూ..
ప్రజల సమస్యలు వింటూ..

ప్రజల కష్టాలు తొలగించి, వారి ముఖాల్లో చిరునవ్వు చిందింపజేసేందుకే నా పాదయాత్ర.. ప్రజలకు చెందిన ప్రతి ఒక్క సమస్యా.. నా సమస్యే.. వారి బాధ .. నా బాధే.. ప్రజల తరఫున పోరాడుతా.. అవినీతి పాలన అంతం చేస్తా.. ప్రజలు మెచ్చే పాలన తీసుకొస్తా.. వైఎస్​ షర్మిల. వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.

యాత్రకు శ్రీకారం ఇలా..

యాత్రలో ముందుకు సాగుతున్న షర్మిల
యాత్రలో ముందుకు సాగుతున్న షర్మిల

చేవెళ్ల మరో పాదయాత్రకు వేదికైంది. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు. 2003లో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఇక్కడి నుంచే యాత్ర చేపట్టారు. 2012లో షర్మిల ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించారు. 230 రోజులపాటు 116 నియోజకవర్గాల్లో 3,112 కిలోమీటర్లు చుట్టివచ్చారు. వైతెపాను స్థాపించిన ఆమె తాజాగా మరోమారు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. బుధవారం చేవెళ్ల నుంచి ప్రారంభించి 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి.. తిరిగి అక్కడే ముగించనున్నారు.

ఆవిర్భావం రోజే ప్రకటన

ఈ ఏడాది జులై 8న పార్టీ ఆవిర్భవించగా.. పాదయాత్ర చేపడతామని ఆ రోజే షర్మిల ప్రకటించారు. మరోవైపు నిర్మాణపరంగా ఇతర పార్టీలు జిల్లా స్థాయిలో కార్యవర్గాలను ఏర్పాటు చేసుకుంటే... వైతెపా పార్లమెంట్‌ స్థానాలను ఎంచుకుని.., వాటికి కన్వీనర్లు, కోకన్వీనర్లను ప్రకటించింది. ప్రస్తుతం పాదయాత్ర కూడా హైదరాబాద్‌ పార్లమెంటు స్థానం మినహా 16 సెగ్మెంట్లను చుట్టేలా పార్టీ ప్రణాళిక రూపొందించింది.

రూట్ మ్యాప్ ఇదే..

మొదటి పది రోజులు చేవెళ్ల, భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో యాత్ర సాగనుంది. ఇదే మాదిరి రాష్ట్రంలోని దాదాపు అన్ని శాసనసభ నియోజకవర్గాలను చుట్టివచ్చేలా రూట్‌మ్యాప్‌ను పార్టీ శ్రేణులు రూపొందించాయి. మొత్తం 26 సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశాయి. అన్ని మండలాల్లోని మున్సిపాలిటీలు, పెద్ద గ్రామాల మీదుగా యాత్ర కొనసాగుతుందని పార్టీ అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి: Ys Sharmila Padayatra: కేసీఆర్ అవినీతి, నియంత పాలనతో ప్రజలు విసిగిపోయారు: షర్మిల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.