Woman Died After Clash With Son In Shadnagar : రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ప్రతాప్ లింగం తెలిపిన వివరాల ప్రకారం షాద్నగర్లో కేశంపేట రోడ్లో సుగుణ(42) తన కుమారుడితో నివాసం ఉంటోంది. సుగుణ మద్యానికి బానిసై రోజంతా తాగుతూ ఉండడంతో తల్లి, కుమారుడి మధ్య తరచూ వాగ్వాదం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో కల్లు తాగడానికి రూ. 20 ఇవ్వాలంటూ సుగుణ, తన కుమారుడు శివతో గొడవ పడింది. శివ డబ్బులు ఇవ్వకపోవడంతో ఆమె అతనిపై చేయి చేసుకుంది. కోపోద్రిక్తుడైన శివ సైతం తల్లిపై చేయి చేసుకున్నాడు. చుట్టుపక్కల ఉన్నవారు వచ్చి ఇద్దరికి సర్దిచెప్పారు. అనంతరం శివ బయటకి వెళ్లిపోయాడు. సాయంత్రం ఏడు గంటల సమయంలో ఇంటికి రాగా, గేటు ముందు తల్లి మత్తులో పడి ఉంది.
Clash between mother and son : రాత్రి తన కూతురుకి ఫోన్ చేసి రమ్మని చెప్పంది. ఆమె ఇంటికి వచ్చి తల్లికి, సోదరుడికి నచ్చచెప్పి వెళ్లిపోయింది. మరుసటి రోజు సోమవారం ఉదయం 8 గంటల సమయంలో శివ తన తల్లిని నిద్రలేపేందుకు ప్రయత్నించగా, ఆమె లేవకపోవడంతో పొరుగింటి వాళ్లను పిలిచాడు. సుగుణ మృతి చెందిందని విషయం తెలియగానే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
మంటల్లో కాలిపోయిన గుర్తు తెలియని మహిళ - హత్య కోణంలో దర్యాప్తు
'సుగుణ అనే మహిళ తాగడానికి తన కుమారుడు శివను డబ్బులు అడిగింది. దీంతో కుమారుడు ఆమెను కొట్టాడు. ఈ క్రమంలో పొరుగింటి వాళ్లు గొడవను ఆపి, ఆమె కుమారుడిని బయటకు పంపారు. అనంతరం సుగుణ కూడా జయటకు వెళ్లి మద్యం సేవించి, తిరిగి ఇంటికి వచ్చింది. తర్వాత ఆమె తన కుమార్తెను పిలిపించి, గొడవ గురించి చెప్పింది. తన కుమార్తెతో కుమారుడిని పిలిపించింది. ఈ క్రమంలో సుగుణ కుమార్తె తన సోదరుడిని గొడవ గురించి అడిగింది. అతని తల్లి మద్యానికి బానిసై డబ్బులు కావాలంటూ వేధిస్తోందని శివ చెప్పాడు. ఆమె మృతిపై విచారణ జరుపుతున్నాం' - ప్రతాప్ లింగం, ఇన్స్పెక్టర్
ఆస్తి కోసం అమ్మనే అంతమొందించాడు - తప్పించుకుందామనుకున్నా దొరికిపోయాడు
రాయదుర్గం కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్ - సోదరే ప్రధాన సూత్రధారి