రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామంలో అధికారులు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులకు చీరలు అందజేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని ప్రశంసించారు. గ్రామంలో 30 రోజుల ప్రణాళిక పనులు ముమ్మరంగా సాగుతున్నందకు ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఇదీచూడండి: కాసేపట్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ