ETV Bharat / state

రాచకొండ సీపీని కలిసిన జేఎన్​ఎన్​యూఆర్ఎం ఇళ్ల బాధితులు - Telangana news

కబ్జాదారుల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ... జేఎన్​ఎన్​యూఆర్ఎం ఇళ్ల బాధితులు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్​ భగవత్​ను ఆశ్రయించారు. అసలైన లబ్దిదారులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

రాచకొండ సీపీని కలిసిన జేఎన్​ఎన్​యూఆర్ఎం ఇళ్ల బాధితులు

author img

By

Published : Feb 3, 2021, 7:19 PM IST

జేఎన్​ఎన్​యూఆర్ఎం ఇళ్ల బాధితులు... రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్​ భగవత్​ను ఆశ్రయించారు. 2006లో కేంద్ర ప్రభుత్వం జేఎన్ఎన్​యూఆర్ఎం స్కీం కింద రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలో మీర్​పేట్​ నందనవనంలో 512 నివాస గృహాల నిర్మాణానికి అనుమతినిచ్చింది. 2016లో ఈ ఇళ్ల కోసం ఒక్కొక్క లబ్దిదారుడు రూ. 80,250 చెల్లించారు.

2020 అక్టోబర్​లో లబ్దిదారులకు తాళాలను కూడా అందజేశారు. కానీ కొందరు స్థానికులు ఇళ్లను కబ్జా చేసి అక్కడికి వెళ్లిన వారిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్​ను కలవగా కబ్జాదారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా రాచకొండ కమిషనర్​కు లేఖ రాసినప్పటికీ... ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు వాపోయారు. ఇప్పటికైనా రాచకొండ పోలీస్ కమిషనర్ చొరవ తీసుకొని కబ్జాదారుల నుంచి ఆ ఇళ్లకు విముక్తి కల్పించి... అసలైన లబ్దిదారులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

ఇదీ చదవండి: మొన్న కోళ్లు.. నిన్న కాకులు.. ఇవాళ కుక్కలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.