భారత అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్వేచ్ఛా పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల జ్ఞాపకార్థం సరూర్‌నగర్ సర్కిల్ కార్యాలయంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రతి ఏడాది జనవరి 30న భారత దేశం అమరవీరుల దినోత్సవాన్ని షాహీద్ దివాస్‌గా జరుపుకుంటోందని అధికారులు తెలిపారు. అమరులను గౌరవించడంలో భాగంగా రెండు నిమిషాలు మౌనం పాటించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మంజుల వాణి, డాక్టర్ జ్యోతి బాయి, కె. కవిత, ఇతర ఏఎన్‌ఎంలు, ఆస్పత్రి సూపరింటెండెంట్లు, పోలీసులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మహాత్మునికి ప్రముఖుల నివాళి...