రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 22 రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా బస్‌డిపో ముందు కుటుంబసభ్యులతో నిరాహార దీక్షకు దిగారు. తల్లిదండ్రులతో పాటు చిన్నచిన్న పిల్లలు కూడా సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: 'మేం ఎంత బుజ్జగించినా... జేఏసీ నేతలు పట్టు వీడలేదు'