ETV Bharat / state

మియాపూర్​ డివిజన్లలో తెరాస జయకేతనం - హైదరాబాద్ లేటెస్ట్ న్యూస్

మియాపూర్​ 4 డివిజన్లలో తెరాస విజయం సాధించింది. ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి, జగదీశ్వర్ గౌడ్, పూజిత జగదీశ్వర్​లు ఎన్నికయ్యారు. వీరి గెలుపు పట్ల తెరాస వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి.

trs victory at miyapur divisions in ghmc elections 2020
మియాపూర్​ డివిజన్లలో తెరాస జయకేతనం
author img

By

Published : Dec 5, 2020, 11:00 AM IST

శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మియాపూర్ 4 డివిజన్ల​లో తెరాస అభ్యర్థులు గెలుపొందారు. గత ఎన్నికల్లో తెరాస నుంచి పోటీ చేసిన మియాపూర్ మేక రమేశ్ మరణంతో ఆ సీటును ఉప్పలపాటి శ్రీకాంత్​కు ఇచ్చారు. చందానగర్ డివిజన్​లోని బొబ్బ నవత రెడ్డిపై అనేక ఆరోపణల దృష్ట్యా ఆమె స్థానంలో మంజుల రఘునాథ్ రెడ్డి సీటు ఇచ్చారు. మాదాపూర్ డివిజన్ నుంచి జగదీశ్వర్ గౌడ్ మూడోసారి పోటీచేసి హ్యాట్రిక్ సాధించారు.

జగదీశ్వర్ గౌడ్ సతీమణి పూజిత జగదీశ్వర్ గౌడ్ హఫీజ్​పేట డివిజన్​కి రెండో సారి ఎన్నికయింది. అత్యధిక మెజార్టీతో భార్యాభర్తలిద్దరూ ఎన్నికయ్యారు. వీరి గెలుపుతో తెరాస వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి.

ఇదీ చదవండి: గ్రేటర్​ ఫలితం : స్వల్ప ఆధిక్యంతో అత్యధిక స్థానాలు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.