పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి వాణిదేవి గెలుపుతో కార్యకర్తలు సంబురాలు మిన్నంటాయి. హైదరాబాద్ చైతన్యపురి మాజీ కార్పొరేటర్ విఠల్ రెడ్డ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై బాణాసంచా కాల్చి వేడుకలు జరుపుకున్నారు.
చైతన్యపురి బస్టాప్ వద్ద వాహనదారులకు స్వీట్స్ పంచుతూ సంబురాల్లో మునిగిపోయారు. తెరాసకు ఓటు వేసిన పట్టభద్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.