ETV Bharat / state

జల్​పల్లి వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని ప్రకటించిన తెరాస - రంగారెడ్డి జిల్లా వార్తలు

త్వరలో జరగనున్న జల్​పల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ ఉపఎన్నిక తెరాస అభ్యర్థిని ప్రకటించారు. పురపాలిక తెరాస అధ్యక్షుడు ఇక్బాల్ బిన్​ ఖలీఫా ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో 28వ వార్డు అభ్యర్థిగా అఫ్సర్ సుల్తానాను ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

TRS announces councilor candidate in Jal Palli municipality
జల్​పల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ ఉపఎన్నిక తెరాస అభ్యర్థిని ప్రకటించిన నేతలు
author img

By

Published : Apr 10, 2021, 6:04 PM IST

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి పురపాలికలో వార్డు కౌన్సిలర్ ఉపఎన్నిక అభ్యర్థిని తెరాస నాయకులు ప్రకటించారు. తెరాస మున్సిపాలిటీ అధ్యక్షుడు ఇక్బాల్ బిన్ ఖలీఫా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 28వ వార్డు అభ్యర్థిగా అఫ్సర్ సుల్తానాను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ రోజు జల్​పల్లి పురపాలిక పరిధిలోని కార్యకర్తలతో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

సబితా ఇంద్రారెడ్డి సూచనతో మద్దతుగా నిలిచిన నేతలకు, కార్యకర్తలకు అభ్యర్థి అఫ్సర్ సుల్తానా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు షంషుద్దీన్, మజర్, తెరాస నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: క్రీడల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం: శ్రీనివాస్​గౌడ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.