ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి - నందిగామలో రోడ్డుప్రమాదం

రంగారెడ్డి జిల్లా నందిగామ సమీపంలో ట్రావెల్​ బస్సు, ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రంజిత్​ కుమార్​ అనే యువకుడు అక్కడిక్కడే మరణించాడు. యువకుడి మరణం వల్ల కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Travel bus and Bike Road Accident at Nandigama village, One Person dead in this Accident
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
author img

By

Published : May 27, 2020, 6:08 PM IST

రంగారెడ్డి జిల్లా నందిగామ సమీపంలోని నూజీవీడు పత్తి విత్తన పరిశ్రమ ముందు రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన రంజిత్ కుమార్ అనే యువకుడు తన ద్విచక్ర వాహనంపై కొత్తూరు వైపు వెళ్తుండగా హైదరాబాద్​ వైపునుంచి షాద్​నగర్​ వస్తున్న ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో రంజిత్ కుమార్​కు తీవ్రగాయాలు కావటం వల్ల అక్కడికక్కడే మరణించాడు. వాహనాన్ని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు డ్రైవర్ ఆపకుండా ముందుకు వెళ్లిపోవటం వల్ల పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్​నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.