ETV Bharat / state

వరద బాధితుల సమస్యను పరిష్కరించకపోవడం సిగ్గుచేటు: ఉత్తమ్​ - rangareddy district news

వరద ధాటికి నీటమునిగిన ఉస్మాన్​నగర్​ ప్రాంతాన్ని టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​ సందర్శించారు. గత 2నెలల నుంచి ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించకపోవడం సిగ్గుచేటన్నారు.

tpcc chief utham kumar reddy inspected flood effected area usman nagar in rangareddy district
వరద బాధితుల సమస్యను పరిష్కరించకపోవడం సిగ్గుచేటు: ఉత్తమ్​
author img

By

Published : Nov 13, 2020, 8:15 PM IST

వరద బాధితుల సమస్యను పరిష్కరించకపోవడం సిగ్గుచేటు: ఉత్తమ్​
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో వరద ధాటికి నీటమునిగిన ఉస్మాన్ నగర్ ప్రాంతాన్ని టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​కుమార్​రెడ్డి సందర్శించారు. వరద బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. గత 2నెలల నుంచి ఉస్మాన్ నగర్​లో ఇళ్లు నీటిలో మునిగిపోయి ఉంటే ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోవడం సిగ్గుచేటన్నారు.

కలెక్టర్​తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. రెండు నెలల నుంచి సమస్యను పరిష్కారం చేయకుండా ఉన్నవారికి ప్రభుత్వంలో ఉండే అర్హతే లేదని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఫిరోజ్ ఖాన్, చల్ల నర్సింహారెడ్డి, దేపా భాస్కర్​రెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: అన్ని కేంద్రం ఇస్తే ఇంక మీరేం చేస్తారు?: బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.