ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రంగారెడ్డి జిల్లాలోని హిమాయత్‌సాగర్ జలాశయానికి వరద పోటెత్తింది. నిండుకుండలా మారిన ఈ జలాశయ గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గేట్లు ఎత్తితే వరద నీరంతా మూసీలోకి చేరనుంది. ఈ క్రమంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
హిమాయత్‌సాగర్‌లోకి 1,666 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. సాగర్ గరిష్ఠ నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. హిమాయత్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1762.60 అడుగులు ఉంది. ఉస్మాన్‌సాగర్ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1790 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 1784.60 అడుగులకు చేరింది.