ETV Bharat / state

శంషాబాద్​లో ఓఆర్​ఆర్​ సర్వీస్ రోడ్డు వద్ద కారు బోల్తా

శంషాబాద్​ నుంచి రాజేంద్రనగర్ వెళ్తుండగా ఔటర్ రింగ్​రోడ్డు సర్వీస్ రోడ్డు పై టాటా సఫారీ కారు బోల్తా పడింది. వారం క్రితం అదే ప్రాంతంలో ఫార్చునర్ కారు ప్రమాదానికి గురయింది.

tata safari car accident on Shamshabad Outer Ring Road Service Road
శంషాబాద్ ఔటర్ రింగ్గురోడ్డు సర్వీస్ రోడ్డు వద్ద కారు భోల్తా
author img

By

Published : Jul 6, 2020, 4:50 PM IST

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్వాల్ గుడా ఔటర్ రింగ్​రోడ్డు సర్వీస్ రోడ్డు పై టాటా సఫారీ కారు బోల్తా పడింది. నలుగురికి సల్ప గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. వీరంతా శంషాబాద్ నుంచి రాజేంద్రనగర్ వెళుతుండగా ప్రమాదం జరిగింది. కారు వద్ద మద్యం బాటిల్స్ ఉండటంతో మద్యం సేవించి వాహనం నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వారం క్రితం ఓ స్టీల్ వ్యాపారి ఫార్చునర్ బోల్తా కొట్టిన స్థలంలోనే మళ్ళీ ఈ కారు బోల్తా కొట్టింది. ఈ ప్రాంతంలో రోడ్డు మలుపు ఉండడం, రోడ్డు మార్గం సరిగ్గా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండీ: రోడ్డుపై నిలిచిన డీసీఎం.. చీకట్లో ఢీ కొట్టి బైకర్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.