ETV Bharat / state

పిటిషనర్‌ వాదనలు వినాలి.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సుప్రీం వ్యాఖ్య

Supreme Court on Palamuru-RangaReddy project: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అవినీతి జరిగిందంటూ వేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఉత్తర్వులిచ్చే ముందు పిటిషనర్‌ వాదనలు వినాల్సి ఉందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Supreme Court
Supreme Court
author img

By

Published : Jan 3, 2023, 8:20 AM IST

Supreme Court on Palamuru-Ranga Reddy project: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పిటిషనర్‌ వాదనలు వినాల్సి ఉందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ హిమాకోహ్లితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. వేల మంది ప్రజలపై ప్రభావం చూపే ప్రాజెక్టుపై ఒక పిటిషన్‌ తర్వాత మరోటి దాఖలు చేస్తున్నారని, ముందు పిటిషన్‌ విచారణలో ఉన్న విషయాన్ని పిటిషనర్‌ తెలపలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ దశలో జోక్యం చేసుకున్న జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ తాము ఉత్తర్వులిచ్చే ముందు పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినాల్సి ఉందన్నారు. పిటిషన్లకు సంబంధించిన సమాచారాన్ని కలిపి అందించేందుకు అనుమతించాలని ధర్మాసనానికి ప్రశాంత్‌ భూషణ్‌ విన్నవించారు. అందుకు సమ్మతించిన ధర్మాసనం కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.