భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చర్యల వల్ల దేశ వ్యాప్తంగా ఆందోళనలు పెల్లుబికాయని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ఆరోపించారు. 1975 జూన్ 25న ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని బ్లాక్‌డేగా పాటించాలని పిలుపునిచ్చిన భాజపా... రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యనేతలు వీడియోకాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా భాజపా నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
1975 దమనకాండను నేటి తరానికి తెలియజేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు లక్ష్మణ్ తెలిపారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటంలో ఆర్ఎస్‌ఎస్ ప్రధాన పాత్ర పోషించిందన్నారు. 1975 జూన్ 25న విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో అనేకమంది జైలుకు వెళ్లారని లక్ష్మణ్ గుర్తుచేశారు.
ఇదీ చూడండి: ప్రతిఇంటికీ ఆరు మొక్కలు... వాటికి కుటుంబ సభ్యుల పేర్లు: కేసీఆర్