ETV Bharat / state

రామోజీ రావును కలిసిన దక్షిణ కొరియా రాయబారి ప్రతినిధి బృందం

south korea Ambassador meet ramoji rao హైదరాబాద్​లోని రామోజీ ఫిల్మ్ సిటీని దక్షిణ కొరియా ప్రతినిధి బృందం సందర్శించింది. ఇండియాలోని సౌత్ కొరియా రాయబారి చాంగ్​ జే బోక్​ నేతృత్వంలోని బృంద సభ్యులు చిత్రనగరి అందాలను వీక్షించారు. అనంతరం రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీ రావును మర్యాదపూర్వకంగా కలిశారు.

rfc
రామోజీ రావును కలిసిన దక్షిణ కొరియా భారత రాయబారి
author img

By

Published : Aug 18, 2022, 10:52 PM IST

ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన రామోజీ ఫిల్మ్ సిటీని దక్షిణ కొరియా ప్రతినిధి బృందం సందర్శించింది. భారత్​లోని ఆ దేశ రాయబారి చాంగ్ జే బోక్ నేతృత్వంలోని బృంద సభ్యులు రామోజీఫిల్మ్​సిటీలో పర్యటించారు. ఫిల్మ్​ సిటీలో షూటింగ్​ సెట్‌లు, లొకేషన్స్​, పలు స్టూడియోలతో సహా అనేక ఫిల్మ్ మేకింగ్ సౌకర్యాలను పరిశీలించారు.

ఫిల్మ్​ సిటీలోని సౌకర్యాలు, విభాగాలు, రంగస్థల నిర్మాణాలను దక్షిణ కొరియా ప్రతినిధి బృందం వీక్షించింది. చాంగ్ జే బోక్​తో పాటు ప్రతినిధులంతా మాయ సెట్​ను సందర్శించారు. అక్కడ అంతర్గత సెట్ డిజైన్, నిర్మాణ సదుపాయం, డిజైన్‌ను రూపొందించడంలో ఉన్న నైపుణ్యాన్ని ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా.. చాంగ్ జే బోక్ బృందానికి రామోజీరావు జ్ఞాపిక బహుకరించారు. ఈ కార్యక్రమంలో గు జంగ్ హ్యూన్, ఆర్​ఎఫ్​సీ ఎండీ విజయేశ్వరి, మేనేజింగ్ డైరెక్టర్, రామోజీ ఫిల్మ్ సిటీ డైరెక్టర్ సీహెచ్​ సోహనా హాజరయ్యారు.

ఇవీ చదవండి: ఇలాంటి ఘటనలు మన దేశంలోనే చెల్లుతాయంటూ కేటీఆర్​ నిర్వేదం

ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆన్​లైన్ టాక్సీ సేవలు, దేశంలోనే తొలిసారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.