Stundents visit RFC: రామోజీ ఫిల్మ్‌సిటీలో పాఠశాల విద్యార్థుల రాకతో సందడి నెలకొంది. హైదరాబాద్ పరిసరాల్లోని ఓ విద్యాసంస్థకు చెందిన దాదాపు 700 మంది విద్యార్థులు ఫిల్మ్‌సిటీని సందర్శించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహలతో కేరింతలు కొట్టారు.
కరోనా వల్ల ఆన్‌లైన్ పాఠాలతో ఇంటికే పరిమితమైన విద్యార్థులకు ఫిల్మ్‌సిటీ టూర్ ఒక గొప్ప ఆహ్లాదాన్ని పంచింది. సినీ ప్రపంచంలో భారీ వసూళ్లు రాబట్టిన బాహుబలి సెట్ చూసి కొత్త ఉత్సాహంతో ఉర్రూతలూగారు. బర్డ్స్ పార్కు, సెలయేళ్ల సవ్వడితో ప్రపంచాన్ని మరిచిపోయి సరికొత్త ఆనందంతో గడిపారు.
ఇవీ చదవండి:
'3 రోజులు భాజపా నేతల సర్కస్.. బిర్యానీ తిని.. ఇరానీ ఛాయ్ తాగి జంప్..'