శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరోసారి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సౌదీ అరేబియా నుంచి అక్రమంగా తరలిస్తున్న 3.11 కిలోల బంగారాన్ని విమానాశ్రయంలో అధికారులు గుర్తించారు. దీని విలువ కోటీ 66 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. సౌదీ అరేబియాలోని దామ్మమ్ నగరం నుంచి హైదరాబాద్ వచ్చిన వందే భారత్ మిషన్ ప్రత్యేక వమానంలో ప్రయాణికుల నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం అక్రమ రవాణా చేస్తున్న 11 మందిపై స్మగ్లింగ్ కేసు నమోదు చేశారు. బంగారాన్ని ప్యాంటులోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జేబుల్లో దాచి తరలించినట్టు అధికారులు తెలిపారు.
శంషాబాద్ విమానాశ్రయంలో 3.11 కిలోల బంగారం పట్టివేత - బంగారం పట్టివేత
![శంషాబాద్ విమానాశ్రయంలో 3.11 కిలోల బంగారం పట్టివేత seizure-of-3-dot-11-kg-of-gold-at-shamshabad-airport-hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8240621-thumbnail-3x2-gold.jpg?imwidth=3840)
10:04 July 31
శంషాబాద్ విమానాశ్రయంలో 3.11 కిలోల బంగారం పట్టివేత
10:04 July 31
శంషాబాద్ విమానాశ్రయంలో 3.11 కిలోల బంగారం పట్టివేత
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరోసారి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సౌదీ అరేబియా నుంచి అక్రమంగా తరలిస్తున్న 3.11 కిలోల బంగారాన్ని విమానాశ్రయంలో అధికారులు గుర్తించారు. దీని విలువ కోటీ 66 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. సౌదీ అరేబియాలోని దామ్మమ్ నగరం నుంచి హైదరాబాద్ వచ్చిన వందే భారత్ మిషన్ ప్రత్యేక వమానంలో ప్రయాణికుల నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం అక్రమ రవాణా చేస్తున్న 11 మందిపై స్మగ్లింగ్ కేసు నమోదు చేశారు. బంగారాన్ని ప్యాంటులోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జేబుల్లో దాచి తరలించినట్టు అధికారులు తెలిపారు.
TAGGED:
బంగారం పట్టివేత