రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రాలు తెచ్చిన వారిని పాఠశాలలోనికి అనుమతించారు. విద్యార్థులకు శానిటైజ్ చేశారు. కొవిడ్ నిబంధనల ప్రకారం తరగతి గదుల్లో విద్యార్థులను కుర్చొబెట్టారు. విద్యార్థులంతా మాస్కులు ధరించి పాఠశాలకు వచ్చారు.
ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ కిరణ్... ఉచితంగా నోటు పుస్తకాలు అందించారు.
ఇదీ చూడండి: ఇలా ఉంటే బడి.. అస్సలు మానాలనిపించదు మరి..