ETV Bharat / state

'ప్రవీణ్​​ కమార్​పై అసత్య ప్రచారాలు మానుకోండి' - ప్రవీణ్​ కుమార్​పై అసత్య ప్రచారాలు మానుకోవాలని ఎస్సీ సంఘాల ఆందోళన

ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న డా. ఆర్​.ఎస్​ ప్రవీణ్​ కుమార్​పై భాజపా నేతలు అసత్య ఆరోపణలు చేయడం తగదని స్వైరోస్​, ఎస్సీ సంఘాల నేతలు అన్నారు. గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్న ఆయనపై ఆసత్య ప్రచారాలను మానుకోవాలని హితవు పలికారు.

SC leaders worried about false propaganda against Praveen Kumar
'ప్రవీణ్​​ కమార్​పై అసత్య ప్రచారాలు మానుకోండి'
author img

By

Published : Mar 17, 2021, 4:41 PM IST

రాష్ట్ర గురుకులాల కార్యదర్శి డా. ఆర్​.ఎస్​ ప్రవీణ్​ కుమార్​పై భారతీయ జనతా పార్టీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని స్వైరోస్​, ఎస్సీ సంఘాల నేతలు ఆరోపించారు. భాజపా నాయకులు ఆయనకు క్షమాపణ చెప్పాలని కోరుతూ.. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.

గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులను ఉన్నత స్థాయికి చేరుస్తున్న ప్రవీణ్ కుమార్​పై ఆర్​ఎస్​ఎస్​, భాజపాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను మానుకోవాలని ఎస్సీ సంఘాల నేతలు అన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వారిపై ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. కమలం పార్టీ నాయకులు ప్రవీణ్​ కమార్​కు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి: సీల్ లేని బ్యాలెట్ బాక్సులు తెచ్చారని ఏజెంట్ల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.