తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటీకి అభివృద్ధిలో భాగంగా ఇద్దరు ముఖ్యమంత్రులు విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన 'టెక్ రిసోనెన్స్ 2K20' ఫెస్ట్‌లో అమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులపై చేస్తోన్న ఖర్చును పెట్టుబడిగా భావిస్తున్నామన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన కంపెనీలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారని అమె పేర్కొన్నారు.
విద్యార్థులు విద్యారంగంలో రానించి... నూతన ఆవిష్కరణలతో దేశాభివృద్ధికి కృషి చేయ్యాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అవంతి విద్యాసంస్ధల ఛైర్మన్, ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: చంద్రబాబు బస్సుయాత్రలో జేబు దొంగల చేతివాటం