Sabitha Indra Reddy about Palamuru-Rangareddy Project : సంకల్ప బలం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు ఇస్తారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు బోరు బావుల మీద ఆధారపడిన జిల్లాలని.. సీఎం కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు కానుకగా ఇవ్వనున్నారని అన్నారు. పాలమూరు ప్రాజెక్టు ప్రజల ఆకాంక్షే కాకుండా ముఖ్యమంత్రి ఆకాంక్ష కూడా అని తెలిపారు. మొదటి దశగా తాగు నీరు, రెండో దశగా సాగు నీరు అందజేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టును అడ్డుకునేందుకు విపక్ష పార్టీలు ఎన్నో ఆటంకాలు సృష్టించారని.. వాటిని అన్నింటినీ కేసీఆర్ సమర్థవంతంగా ఎదుర్కొని పర్యావరణ అనుమతులు తీసుకువచ్చారని వివరించారు.
Sabitha Indra Reddy Fire on BJP : ఈ ప్రాజెక్టుపై బీజేపీ నాయకులు కేంద్రాన్ని ఒప్పించి జాతీయ హోదా తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలా తేలేని పక్షంలో దీనిపై మాట్లాడే హక్కు వారికి లేదని మండిపడ్డారు. సంకల్ప బలం ఉన్న నాయకుల వల్లే ప్రాజెక్టులు సాకారం అవుతాయని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు నేడు రాష్ట్రంలో నిజమవుతున్నాయని అన్నారు. సాధ్యం కాదనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు సాకారమైందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇచ్చామని చెబుతోందని.. రాష్ట్ర నిధులతోనే ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి మూడేళ్లలోనే పూర్తి చేశారని అన్నారు. ఇప్పుడు అదే నమ్మకం పాలమూరు ప్రాజెక్టుపై ఉందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రం అన్నపూర్ణగా మారిందంటే అది కేసీఆర్ వల్లేనని చెప్పారు. రాష్ట్రం రైతులకు వెన్నుముకగా మారిందని అన్నారు.
"నీళ్లు, నిధులు, నియామకాల తెలంగాణ కళ నిజమవుతుంది. సాధ్యం కాదనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు సాకారమైంది. కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి మూడేళ్లలో పూర్తి చేసి ఇచ్చారు. ఇప్పుడు అదే నమ్మకం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ఉంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు ఇస్తారు. ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎన్నో ఆటంకాలు సృష్టించారు. రాష్ట్రం అన్నపూర్ణగా మారిందంటే అది ముఖ్యమంత్రి కృషి వల్లే. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు బీజేపీ నాయకులు కేంద్రాన్ని ఒప్పించి.. జాతీయ హోదా తీసుకురావాలి. లేదంటే బీజేపీ నాయకులకు అడిగే హక్కు లేదు." - సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
Palamuru- Rangareddy Project Details : పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు.. ఇకపై ఎవరూ అడ్డుకోలేరని, అడ్డుకుంటే సహించేది లేదని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు మండలం కరివెన జలాశయం వద్ద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించిన సందర్భంగా సంబరాలు నిర్వహించారు. కృష్ణాజలాలతో కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం, పాలాభిషేకం చేశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్.. స్వయంగా డప్పుకొట్టి ఉత్సాహపరిచారు.
Niranjan Reddy Speech on Palamuru- Rangareddy Project : పాలమూరు ప్రజల కాళ్లను కృష్ణమ్మ నీళ్లతో తడుపుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ శపథం చేశారని ఆ కల త్వరలోనే నెరవేరబోతోందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. పర్యావరణ అనుమతులు వచ్చినందున పాలమూరు కష్టాలు తీరినట్లేనని చెప్పారు. ఇంటి దొంగల కేసులు, పొరుగు రాష్ట్రం అభ్యంతరాలు, కేంద్ర సహాయ నిరాకరణ వైఖరివల్లే..ప్రాజెక్టు రెండేళ్లు ఆలస్యమైందని మంత్రి వివరించారు.
ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే.. శాశ్వతంగా తొలగింపు: సబితా ఇంద్రారెడ్డి
కేంద్రంలోని పెద్దల పర్యవేక్షణలోనే.. బండి సంజయ్ కుట్రలు: సబితా