ఇబ్రహీంపట్నంలోని ఆర్టీసీ డిపోకు ఉదయం 5 గంటల నుండి కార్మికులు డిపో వద్దకు చేరుకొని విధులకు హాజరవుతున్నారు. రాత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల్లోకి చేరాలని ఆదేశించడంతో ఈరోజు ఉదయం నుండే తమతమ విధులకు హాజరవుతున్నారు.
ముఖ్యమంత్రి సూచించినట్లుగా సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామని.. లాభాల్లోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తామని సిబ్బంది తెలిపారు.