ETV Bharat / state

కేసీఆర్​ను గద్దెదించడమే లక్ష్యంగా పాదయాత్ర: రేవంత్‌ రెడ్డి

author img

By

Published : Feb 17, 2021, 6:23 AM IST

పంటను నమ్ముకుని సాగుచేసే రైతుల భూములను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకు గుజరాత్‌ బేరగాళ్లు మోదీ, అమిత్‌షా కుట్ర పన్నుతున్నారని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారత్‌బంద్‌లో పాల్గొన్న కేసీఆర్​ దిల్లీ వెళ్లొచ్చాక... ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారంటూ ఎద్దేవా చేశారు. తక్షణం కేసీఆర్‌ మోదీ జట్టు నుంచి బయటికొచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని డిమాండ్‌ చేశారు.

revanthreddi padayatra at rangareddy district
కేసీఆర్​ను గద్దెదించడమే లక్ష్యంగా పాదయాత్ర: రేవంత్‌ రెడ్డి

ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కేసీఆర్​ను గద్దెదించడమే లక్ష్యంగా త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు భరోసా పేరుతో పది రోజులుగా 149 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో రాజీవ్‌ రైతురణభేరి పేరుతో బహిరంగ సభ ఏర్పాటుచేశారు. పార్టీ శ్రేణులు , కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వందలాది ట్రాక్టర్లతో ర్యాలీగా రేవంత్ రెడ్డి సభకు చేరుకున్నారు. పార్టీ అధిష్ఠానం అనుమతితో త్వరలోనే పాదయాత్రకు రోడ్‌మ్యాప్‌ ఖరారు చేయించుకుని ప్రజల్లోకి వెళతానని రేవంత్‌ స్పష్టం చేశారు.

నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కొనలేరని ఎద్దేవా చేసిన రేవంత్ రెడ్డి.... తెరాస ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. ఫార్మాసిటీ పేరుతో రంగారెడ్డి జిల్లాలో భూములను తక్కువ ధరకే ప్రైవేటు వ్యక్తలకు తాకట్టుపెడుతున్నారని ఆరోపించారు.

ఈ సభకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలైన సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ , షబ్బీర్ అలీ, మల్లు రవి, కుసుమకుమార్, చిన్నారెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, శ్రావణ్ కుమార్ హాజరయ్యారు. రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ మాజీ మంత్రి మల్లు రవి 11 తీర్మానాలను ప్రవేశపెట్టగా చిన్నారెడ్డి ఆమోదించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.