రంగారెడ్డి జిల్లాలోని జలాశయాల్లోకి వరద ప్రవాహం భారీగా తగ్గింది. దీంతో హిమాయత్‌సాగర్ గేట్లు మూసివేశారు. జలాశయంలోకి 350 క్యూసెక్కుల నీరు చేరుతోంది. హిమాయత్‌సాగర్‌లో ప్రస్తుత నీటిమట్టం 1763 అడుగులుగా ఉండగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 1787 అడుగులు.
అలాగే ఉస్మాన్ సాగర్‌లోని 150 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఉస్మాన్ సాగర్ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1787 అడుగులు కాగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు.
ఇదీ చదవండి: భాగ్యనగరంలో కిలో ఉల్లి 35 రూపాయలే..: మంత్రి నిరంజన్‌రెడ్డి