ఆపరేషన్ స్మైల్లో భాగంగా గాజుల పరిశ్రమలో పనిచేస్తున్న 20 మంది బాల కార్మికులకు సైబరాబాద్ పోలీసులు విముక్తి కల్పించారు. మైలార్దేవ్ పల్లి పరిధిలోని రోషన్ కాలనీ, వట్టేపల్లి ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన ప్రత్యేక బృందాలు... పిల్లలు గాజులు తయారీ చేస్తున్నట్లు గుర్తించారు.
గదులకు తాళం వేసి ఆహారం కూడా సరిగి అందించకుండా చిన్నారులను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ చిన్నారుల అంతా బిహార్ రాష్ట్రానికి చెందిన వారని వెల్లడించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్లో పలు కర్మాగారాలు, దుకాణాల్లో పనిచేసే మరో 26 మంది చిన్నారులను ఆపరేషన్ స్మైల్ బృందాలు, మానవ అక్రమ రవాణా నిరోధక బృందాలు రక్షించాయి.
దుకాణాల, కర్మాగారాల యజమానులపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలను వారి స్వస్థలాలకు తరలించే ఏర్పాటు చేపట్టారు.