రంగారెడ్డి జిల్లా సహకార సంఘాల ఛైర్పర్సన్ ఎన్నికలో అధికార పార్టీ జోరుకు బ్రేకులు పడ్డాయి. జిల్లాలోని ముడిమ్యాల సహకార సంఘ అధ్యక్షునిగా కాంగ్రెస్‌కు చెందిన గోన ప్రతాప్‌రెడ్డి, గుండాల సొసైటీలో అధ్యక్షునిగా స్వతంత్ర అభ్యర్థి నక్క బుచ్చిరెడ్డిలు ఎన్నికయ్యారు. ఆదివారం ఈ ఎన్నికలు వాయిదా పడగా గ్రామస్థుల ఆందోళనతో సోమవారం తిరిగి నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ బలగాల మధ్య డైరెక్టర్లు ఓటింగ్ పద్ధతిలో ఛైర్మన్లను ఎన్నుకున్నారు.
ముడిమ్యాల సొసైటీ ఎన్నికల్లో కాంగ్రెస్ 6, తెరాస 6, స్వతంత్ర అభ్యర్థి ఒకచోట గెలిచారు. అధ్యక్షుని ఎన్నికకు స్వతంత్ర అభ్యర్థి మద్దతు ముఖ్యంగా మారినందున... అతన్ని తమవైపు తిప్పుకునేందుకు రెండు పార్టీల నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరికి ఓటింగ్‌లో కాంగ్రెస్‌కి చెందిన గోనె ప్రతాప్‌రెడ్డికి ఏడు ఓట్లు రాగా ఆయనను ఛైర్మన్‌గా, తెరాసకు చెందిన మల్లేశ్‌ను వైస్‌ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు.
ఇవీ చూడండి: 'ఆరోగ్య తెలంగాణే కేసీఆర్ ధ్యేయం'